ఆసుపత్రిలో కేసీఆర్ కుమార్తె కవిత..? ఏమైంది..?

-

కేసీఆర్ కుమార్తె కవిత ఆసుపత్రిపాలయ్యారు. ఆమెకు వైరల్ ఫీవర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆమెను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన ఆమెను ఆమె అన్న, మంత్రి కేటీ రామారావు పరామర్శించారు.

ఆ తర్వాత.. సీఎం కేసీఆర్ కూడా కవితను ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొన్నిరోజులుగా తెలంగాణలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అవసరమైనవీ కానివీ అన్ని రకాలు టెస్టులు చేస్తూ.. ప్లేట్లెట్ల పేరుతో రోగులను భయపెడుతూ వైద్యం పేరుతో డబ్బులు దండుకుంటున్నాయని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వైరల్ జ్వరాలు సెలబ్రెటీలను వదలడం లేదన్నమాట.

ఇక కవిత విషయానికి వస్తే.. ఆమె కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా కనిపించడం లేదు. నిజామాబాద్ ఎన్నికల్లో జనం ఇచ్చిన షాక్ నుంచి ఆమె ఇంకా తేరుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అసలు కలలో కూడా ఊహించని విధంగా ఓడిపోవడం ఆమెకు గట్టి షాక్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news