రియల్ పొలిటీషియన్ గా మారుతున్న కమల్ హాసన్…!

కమల్ హాసన్ రియల్ పొలిటీషియన్ గా మారుతున్నాడు. నిర్మాతలు కోట్లు పెట్టి తీస్తోన్న సినిమాలని రాజకీయాలకు వాడుకుంటున్నాడట కమల్. పొలిటికల్ లైఫ్ కి ప్లస్ అయ్యేలా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక పొలిటికల్ కెరీర్ కోసం విజయ్ సినిమాకి కూడా బ్రేకులేస్తున్నాడని టాక్ వస్తోంది.

విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా రోజులగా ప్రచారం జరుగుతోంది. ‘తుపాకి’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని వచ్చే ఏడాది ‘తుపాకి-2’ రిలీజ్ అవుతుందనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడీ ప్లాన్ మారుతుందని చెప్తున్నారు కోలీవుడ్ జనాలు. కమల్ హాసన్ పొలిటికల్ లైఫ్ కోసం తుపాకి-2ని సైడ్ చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.కమల్ హాసన్ హీరో కమ్ పొలిటీషియన్ గా రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే పొలిటికల్ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమాలతో పొలిటికల్ లైఫ్ కి బూస్టప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పైగా 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అందుకే రాజకీయాలకు పనికొచ్చే సినిమాల్లో నటించాలనుకుంటున్నాడు కమల్. ఈ ప్లాన్స్ తోనే మురుగదాస్ తో ఒక పొలిటికల్ సెటైర్ ప్రిపేర్ చేస్తున్నాడట కమల్.

కమల్ హాసన్ ఎలక్షన్ కోసం సినిమా కావాలని అడగడంతో ‘తుపాకి-2’ని పోస్ట్ పోన్ చేస్తున్నాడట మురుగదాస్. అయితే విజయ్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా విజయ్ ని రాజకీయాల్లోకి రావాలని హడావిడి చేస్తున్నారు. మరి ఇప్పుడు కమల్ కోసం, విజయ్ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నారని తెలిస్తే ఇళయదళపతి ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.