ఐపీఎల్ 38వ మ్యాచ్‌.. పంజాబ్ టార్గెట్ 165..

దుబాయ్ లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 38వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 164 ప‌రుగుల స్కోరు చేసింది. మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది.

delhi made 164 runs against punjab in ipl 2020 38th match

ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో శిఖ‌ర్ ధావ‌న్ అద్భుతంగా రాణించాడు. కేవ‌లం 61 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో స్కోరు బోర్డును ప‌రుగెత్తించాడు. 106 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగిలిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. పంజాబ్ బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ 2 వికెట్లు తీయ‌గా, మాక్స్‌వెల్‌, నీష‌మ్‌, అశ్విన్‌లు త‌లా 1 వికెట్ తీశారు.

కాగా ఆరంభం నుంచి పంజాబ్ బౌల‌ర్లు ఢిల్లీపై ఆధిప‌త్యం చెలాయించారు. కానీ ధావ‌న్ నిల‌క‌డ‌గా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు క‌దిలించాడు. దీంతో ఢిల్లీ గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గలిగింది.