బిగ్ బాస్ 4లోకి కమల్ హాసన్‌..బర్త్ డే గిఫ్ట్‌గా ఎంట్రీ..!

బిగ్ బాస్ 4 తెలుగులోకి కమల్ ఎంట్రి ఇచ్చారు..వీకెండ్ ఎపిసోడ్‌లో ప్రేక్షకులను అలరించడానికి.. నవంబర్ 7న కమల్ హాసన్ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్నే తెలుగు షోకు ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు నిర్వాహకులు.. తెలుగుతో పాటు తమిళనాట కూడా ఇప్పుడు బిగ్ బాస్ 4 నడుస్తుంది.. గతంలో చాలా మంది తెలుగు హీరోలు వచ్చారు..జూనియర్ ఎన్టీఆర్, నాని తర్వాత నాగార్జున వచ్చాడు..తాజాగా కమల్ పుట్టిన రోజు సందర్భంగా వర్చువల్ స్టూడియోలో తెలుగు షోకు తీసుకొచ్చారు నిర్వహకులు.. లోకనాయకుడిని చూసి మన కంటెస్టెంట్స్ కూడా ఫిదా అయిపోయారు..
తెలుగు బిగ్ బాస్ కు కమల్ రావడం ఇదే తొలిసారి కాదు..రెండో సీజన్ లో కూడా నేరుగా ఇంట్లోకి వచ్చాడు కమల్..లోకనాయుడికి తెలుగులో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..ఇక కమల్ హాసన్ ఇంటి సభ్యులను పలకరించాడు. అందరూ ఎలా ఉన్నారు అంటూ అడిగేసరికి.. సూపర్ సర్ అంటూ సమాధానమిచ్చారు..మీ హౌజ్ ఫుల్లుగా ఉంది సర్ అంటూ నాగార్జున అడగ్గా.. నాకు హౌజ్ ఫుల్ అనే మాట యిష్టమంటూ చెప్పాడు కమల్. నాగార్జున కూడా వెంటనే మనందరికీ హౌజ్ ఫుల్ అనే మాట చాలా యిష్టమని చెప్పాడు.