బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే ?

టెలివిజన్ రియాలిటీ సంచలనం బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు విజయవంతంగా తొమ్మిదో వారానికి చేరుకుంది. రేపటితో 9వ వారం ముగియనుంది. రేపు ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రతి వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ లో రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేదానిమీద అప్పుడే లీకులు బయటకు వచ్చేసాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ వారం ఇంటి నుంచి దర్శకుడు కొరియోగ్రాఫర్ అయిన అమ్మరాజశేఖర్ బయటకు వచ్చేయనున్నాడు. నిజానికి ఈ వారం నామినేషన్స్ లో ముక్కు అవినాష్, అమ్మ రాజశేఖర్, అభిజిత్, మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక నామినేషన్స్ లో ఉన్నారు.

అయితే వీరిలో ఇప్పుడు అమ్మ రాజశేఖర్ ఎలిమినేట కాబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి అమ్మ రాజశేఖర్ మొన్నటి వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఎందుకంటే అందరికంటే ఆయనకే తక్కువ ఓట్లు వచ్చాయి కానీ అనారోగ్య కారణంగా నోయల్ బయటకు వచ్చేయడంతో ఈ బిగ్బాస్ షెడ్యూల్ మొత్తం డిస్ట్రబ్ కాకుండా ఆ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు. చివరికి ఈ వారం అమ్మరాజశేఖర్ బయటకు వచ్చేస్తున్నాడు. నిజానికి ఈయన మీద నెటిజన్లు అలాగే బయట జనాలు కూడా కాస్త కోపం గానే ఉన్నారని చెప్పాలి. అయితే ఆయన నిన్న ఇంటికి కెప్టెన్గా ఎంపికయ్యాడు. మరి మామూలుగా అయితే కెప్టెన్ అయిన వారికి ఎలిమినేషన్ నుంచి ఊరట లభిస్తుంది. మరి ఈయనని ఎలా బయటకు పంపెస్తున్నారో చూడాల్సి ఉంది.