తమిళ బిగ్ బాస్ షోలో శ్రీశ్రీ కవిత.. అబ్బురపరిచిన కమల్ హాసన్.

తమిళ బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా కొనసాగుతున్న కమల్ హాసన్ గారు తెలుగు కవిత చెప్పి అందరినీ అబ్బురపరిచారు. శ్రీశ్రీ కవిత చెప్పి మరీ తెలుగు గొప్పతనాన్ని అందరికీ వినిపించాడు. పతితులారా భ్రష్ఠులారా, బాధా సర్పదష్టులారా ఏడవకండేడవకండి. వచ్చేస్తున్నాయ్.. జగన్నాథ్ రథ చక్రాల్.. అంటూ పూర్తి కవిత చదివి, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల కోసం దాన్ని తమిళంలోని అనువదించి మరీ వినిపించాడు.

ఆ కవిత విన్న కంటెస్టెంట్లలో ఒకరు, సార్.. తెలుగులో కవిత చాలా బాగుంది. ఆ మాటలు వింటున్నప్పుడు చాలా గొప్ప ఫీలింగ్ కలిగిందని అన్నారు. దానికి కమల్ హాసన్ గారు బదులిస్తూ, తమిళంలో గొప్ప కవి అయిన సుబ్రహ్మణ భారతి గారు కూడా తెలుగు చాలా సుందరమైనదని చెప్పారని గుర్తు చేసారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. గొప్ప గొప్ప వాళ్లే గొప్ప గొప్ప పనులు చేస్తారు. తమిళ టీవీ షోలో తెలుగు గొప్పతనం వినిపించిన కమల్ గారిని ఎంత గొప్పవారో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.