రాహుల్ గాంధీ తప్పుబడితేనేం.. నేనైతే సారీ చెప్పను !

-

ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి. తమ పార్టీ అగ్రనేత కమల్‌ నాథ్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఖండించారు కూడా, అటువంటి భాషను తాను ఇష్టపడబోనని స్పష్టం చేశారు. అయితే రాహుల్‌ గాంధీ తప్పుబట్టినప్పటికీ ఇమారతీ దేవిపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పేదే లేదని అన్నారు కమల్‌నాథ్.

ఈ కామెంట్స్ మీద తాను ఇప్పటికే తాను వివరణ ఇచ్చినందున సారీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్‌ కామెంట్స్ ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చని అన్నారు. ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేనప్పుడు ఎందుకు సారీ చెప్పాలని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. మధ్య ప్రదేశ్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం కమల్‌నాథ్న ఒక సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఇమారతీ దేవిని ఉద్దేశించి ఐటమ్ అంటూ సంబోధించడం ఇప్పుడు ఈ వివాదానికి కారణం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news