ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసులు నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం… పోలీస్ అమరవీరుల చిత్ర పటాలకు పూల మాల వేచి శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రవాద చర్యలు వల్ల, అరాచక శక్తులు చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నాం అని ఆయన అన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల నిరోధానికి దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన ఘనత సీయం దే అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 87రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ తీసుకువచ్చాం చెప్పారు. రాష్ట్రంలో నేరాలు సంఖ్య 18శాతం తగ్గిందని అన్నారు. కాన్స్టేబుల్ స్థాయి నుండి ఇనస్పెక్టర్ స్థాయి వరకు వీక్లీ ఆఫ్ ప్రప్రధమంగా అమలు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.