ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినం జరుపుకుంటున్నాం అని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సమాజంలోని అసమానతలు ఎదుర్కొంటున్న మహిళలు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాం అని ఆమె అన్నారు. మహిళా మిత్ర, దిశ వంటివి తీసుకొచ్చాం అని చెప్పుకొచ్చారు. 18 దిశ పోలీసు స్టేషన్లు ఉన్నాయి అని ఆమె అన్నారు.
సైబర్ నేరగాళ్ళ నుండి తప్పించుకోవడానికి బాలికలకు అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు. పోలీసు సేవా యాప్ కూడా తీసుకొచ్చాం అని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ను ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని ఆమె పేర్కొన్నారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చాం అని అన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో ప్రధాన పాత్ర పోషించి అమరులైన పోలీసులకు 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చాం అన్నారు.