అమెరికాకు తొలి ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ఎన్నిక..!

అమెరికా చరిత్రలో ఇప్పుడు నవశం ప్రారంభం కానుంది..ఆగ్రదేశంలో కీలకమైన పదవులకు మహిళలు చాలా దూరం ఉండేవారు..ఆ సంసృతికి ఇప్పుడు ముగింపు పలకనుంది అమెరికా..గతంలో ఎప్పుడు లేని విధంగా అమెరికాలో తొలి ఉపాధ్యక్షురాలిగా డెమెక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఎన్నికయ్యారు..ఇది భారత్-జమైకా సంతతికి చెందిన కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనెటర్‌గా ఉన్నారు.. అంతకు ముందు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు కమలా హారిస్‌..కమలా హరీస్‌కు భారత్‌తో చాలా సంబంధంలో ఉంది..కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలది తమిళనాడు. తండ్రి హారిస్ జమైకా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డాడు. కమల చిన్నప్పుడే తల్లి తండ్రి విడిపోయారు. పౌరహక్కుల ఉద్యమంలో యాక్టివ్ గా వుండే శ్యామల..కూతురిని కూడా అలాగే పెంచింది. కచ్చితమైన అభిప్రాయాలు, నమ్మిన దాని కోసం చివరి వరకు పోరాడడం కమలకి చిన్నప్పటి నుంచే అలవాటయ్యాయి.నల్లజాతి మహిళలకు ఇంత వరకూ రెండు ప్రధాన పార్టీల నుంచి అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం ఇవ్వలేదు. తొలి సారిగా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం లభించిన కమలా హారిస్‌..విజయం సాధించడం విశేషం. కమలా హారిస్‌ వయస్సు 55 ఏళ్లు. తొలుత ఆమె అధ్యక్ష పదవికి పోటీపడ్డారు..అయితే గత డిసెంబర్లో తన అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకున్నారు. కమల హోవార్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికాలో నల్లజాతీయులు చదువుకునే యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి.