కామారెడ్డి లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు…టీచర్ పై దాడి చేసి…!

కామారెడ్డిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు స్కూల్ టీచర్ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. టీచర్ రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా దుండగులు బైక్ పై వచ్చి స్కూల్ టీచర్ మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కామారెడ్డి ఇస్లాంపూర్ కు చెందిన చెరుకూరి యమున అనే టీచర్ మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి లాక్కెళ్లారు. పుస్తెలతాడు ఎత్తుకెళ్లే సమయంలో మహిళపై దుండగులు దాడి చేశారు. దాంతో తీవ్రగాయాలతో టీచర్ యమున పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు చైన్ లాక్కెళ్లిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.