మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో… మూడు రోజులపాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో … హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని మద్యం షాపులను గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మూసివేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
28వ తారీకు సాయంత్రం నుంచి వైన్ షాపులు, రెస్టారెంట్లు, మిలటరీ క్యాంటీన్లు మరియు మద్యం డిపోలు మూసివేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే ఓట్ల లెక్కింపు ముగిసేవరకు వైన్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ ఆర్ వి కర్ణన్. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా 30 వ తేదీన ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ సమయం ఉండనుంది. కోవిడ్ సోకిన వారు సైతం సాయంత్రం పిపిఈ కిట్లు ధరించి ఓటు హక్కు వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. 28 న సాయంత్రం 7 గంటల నుండీ 30 తేదీ వరకు డ్రై డే ప్రకటించారు. అధికారులు 97% ఓటర్ల కు ఓటరు స్లిప్పుల పంపిణి చేశారు.