కమ్మ అంటే అమ్మలాంటి వాళ్లు : సీఎం రేవంత్ రెడ్డి

-

కమ్మ అంటే అమ్మలాంటి వాళ్లు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కమ్మ మహా సభల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వాస్తవానికి 2023 కంటే ముందే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కుసుమ కుమార్ కి చెప్పాను.ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. కులం అనేది వృత్తిని బట్టి వచ్చింది. కమ్మ అంటే అమ్మ లెక్క.. అమ్మ ఆకలిని చూస్తుంది. పది మందికి సాయం చేసే గుణం కమ్మ వారిది. సారవంతమైన నేల  ఎక్కడ ఉంటే అక్కడ కమ్మ వారు ఉన్నట్లే అన్నారు.

వారి ఆలోచన ఎప్పుడూ పంటలు పండించి పదిమందికి పెట్టాలనే ఉంటుంది. పది మందికి సహాయపడే వారు కమ్మ వారు. నేను అనర్గళంగా మాట్లాడుతానని అంటున్నారు.  అది ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్నాను. మనకు అవకాశం ఇచ్చిన వారిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి బ్రాండ్ ఫోర్ లీడర్ షిప్ గా పేరు గాంచారు. ఆ రోజు ఆయన ఇచ్చిన అవకాశంతోనే ఇప్పుడు ఇంతమంది నాయకులు రెడీ అయ్యారు. చంద్రబాబు గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news