కంగనా రనౌత్‌కు షాక్.. ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ సమన్లు జారీ

తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ షాక్ ఇచ్చింది. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు శాంతి, సామరస్యాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సమన్లు జారీ చేసింది. ఆప్ నేత రాఘవ చద్దా నేతృత్వంలోని అసెంబ్లీ కమిటీ ఎదుట వచ్చే నెల 6న కంగనా రనౌత్ హాజరు కావాల్సి ఉంటుంది. సిక్కులను ఖలిస్థాన్ టెర్రరిస్టులతో పోలుస్తూ సోషల్ మీడియాలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయమై ముంబయి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సమన్లు జారీ చేయడం గమనార్హం.

దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని 2014లో వచ్చిందని కంగనా చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. 1947లో వచ్చింది భిక్ష మాత్రమే అని పేర్కొన్నారు. కంగనా వ్యాఖ్యలపై ప్రజా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.