నవ దంపతులు రోడ్డు ప్రమాదంలో బిగ్‌ ట్విస్ట్‌..వధువు కూడా మృతి

హైదరాబాద్‌ లోని శేరి లింగంపల్లి లో నిన్న విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన 24 గంటలకే.. నూతన వరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇదే రోడ్డు ప్రమాదంలో… తీవ్రంగా గాయపడిన… పెళ్లి కూతురు… కోమాలోకి వెళ్లింది. అయితే… తాజాగా కోమాలో ఉన్న పెళ్లి కూతురు.. కూడా ఇవాళ ఉదయం మరణించింది. కోమాలోకి వెళ్లిన వధువు కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది.

దీంతో బాధితుల ఇంట వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో పెళ్లి చేసుకుని చెన్నై వెళుతుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో అక్కడిక్కడే వరుడు శ్రీనివాసులు ప్రాణాలు కోల్పోగా… కోమాలోకి వెళ్లిన వధువు కనిమొళి ఇవాళ మరణించింది. ప్రస్తుతం వధువు కనిమొళి… మృత దేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.