బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ప్రస్తుతం తాజాగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ సినిమా ధాకడ్ సినిమా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో కంగనారనౌత్ నెవర్ బిఫోర్ అనిపించుకునేలా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ సరిగ్గా ధాకడ్ సినిమా విడుదలకు ముందు సరికొత్త లగ్జరీ కారు తో చిందులు వేయాలని ప్లాన్ చేయడం చర్చనీయాంశం గా మారింది. వాస్తవానికి కంగనారనౌత్ మెర్సిడెస్-బెంజ్ మే బ్యాక్ S680 కి గర్వించదగిన యజమాని అయ్యింది అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు . ప్రస్తుతం దీని ఖరీదు ఏకంగా 5 కోట్ల రూపాయలు.తాజాగా అందుతున్న కథనాల ప్రకారం మే బ్యాక్ S680 AMG 6.0 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ 12 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 9 స్పీడ్ గేర్ బాక్స్ , ఆల్ వీల్ డ్రైవ్ అమరిక ను కలిగి ఉంది. ఇక ఇది మృగాన్ని తలపించే ఇంజన్ తో డిజైన్ చేయబడింది. ఇక ఈ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం గమనార్హం రకరకాల అధునాతన సౌకర్యాలను కలిగి ఉన్న ఈ కారు చూడడానికి చాలా ఆకర్షణగా అనిపిస్తోంది. ఇదిలా ఉండగా కంగనా నటించిన తాజా చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీగా అలరిస్తోంది. ఇకపోతే కొంతమంది నుంచి నెగిటివ్ ప్రచారాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఈ సినిమాకు ఆరంభ వసూళ్ళ పరంగా ఏమాత్రం డోఖా లేదు అని చెప్పవచ్చు.
ఇక తాజాగా ఈమె ఈ చిత్రంలో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అని చెప్పవచ్చు. ఇక పోతే ప్రస్తుతం భారీ చిత్రాలలో నటించేందుకు ముఖ్యంగా సౌత్ పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి కంగన సిద్ధమవుతోంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.