అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా..?

-

కంగనా రనౌత్.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను ఉప్పెన అని చెప్పవచ్చు. తన బోల్డ్ మాటలతో ప్రతి ఒక్కరికి పిచ్చెక్కిస్తుంది. అంతేకాదు వస్త్రధారణ విషయంలో కూడా కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించేలా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కంగనారనౌత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితం అయింది. ఇక అక్కడ తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ.. అలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మిగిలిపోయింది.

ఇక కంగనా నటనకు విమర్శకుల సైతం ప్రశంసలు చేయాల్సిందే. ఇక సమాజం లో జరిగే ప్రతీ విషయం పై ఏదో రకంగా స్పందిస్తూ విమర్శలకు గురి అవుతూ ఉంటుంది. ఇకపోతే రాజ కుటుంబానికి చెందిన ఈ ముద్దుగుమ్మ నటన మీద ఆసక్తితో చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి సినిమాలకే పరిమితం అయింది. ఇక మంచి చేస్తే వారిని పొగడడం.. చెడు చేస్తే వారిని విమర్శించటం లో కంగనా ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పవచ్చు. బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తాజాగా నటించిన “ధాకడ్” సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కంగనాకు పెళ్లి కి సంబంధించిన ప్రశ్న ఎదురయింది.

యాంకర్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని ప్రశ్నించగా .. ఆమె మాట్లాడుతూ..” నేను అబ్బాయిలను కొడతాననే ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. అందుకే నన్నెవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు”.. అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. ఇక పక్కనే ఉన్న అర్జున్ రాంపాల్ కలుగచేసుకుని కంగనా చాలా స్వీట్, లవ్ లీ అమ్మాయి.. ఎప్పుడూ పూజ , యోగ అంటూ తన పనులలో తాను నిమగ్నమై పోయి అందరికీ ఆదర్శంగా ఉంటుంది.. ఇక సినిమాలో తన పాత్రలు చాలా వైల్డ్ గా ఉంటాయి.. కానీ ఆమె ఒక నార్మల్ గర్ల్ అని తెలిపాడు. ఇక కంగన చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news