Kangana Ranaut: ఐకానిక్ ప్లేస్‌లో 25 అడుగుల హీరోయిన్ కటౌట్..ఆవిష్కరించిన బాలీవుడ్ క్వీన్

-

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్…తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏక్ నిరంజన్’లో హీరోయిన్ గా నటించింది. ఈ పిక్చర్ లో కథానాయికగా నటించే నాటికి ఈమె ఇంకా బాగా పాపులర్ కాలేదు. ఆ తర్వాత బీ టౌన్ ఎంట్రీ ఇచ్చిన కంగన..అక్కడ ‘క్వీన్’ అయిపోయింది.

అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న ఈ హీరోయిన్..తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథా ఏర్పరుచుకుంది. పలు విషయాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది మణికర్ణిక.

కంగన ప్రస్తుతం ‘ధాకడ్’ అనే యాక్షన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ పిక్చర్ కు సంబంధించిన 25 అడుగుల కటౌట్ ను రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ఐకానిక్ రాజ్ మందిర్ సినిమాలో ఏర్పాటు చేశారు. దానిని గురువారం కంగన ఆవిష్కరించారు. ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు, కంగన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ధాకడ్’ సిని మా ఈ నెల 20న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news