పేరుకే జాతీయ పార్టీ అయినా.. అంతర్గతంగా అనేక విభేదాలు, ఎడ్డెం అంటే తెడ్డెం అనే నాయకులు, అం త ర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందనే అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్న నాయకులు ఎక్కువగా ఉన్న ఏపీ బీజేపీలో రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చుట్టూ.. ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన పైకి…. జగన్ ప్ర భుత్వంపై విమర్శలు చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం పెద్దగా స్పందించడం లేదని సోము వీర్రాజు వర్గం అంటోంది. ఇటీవల ఆదివారం వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీజేపీ నాయకులు కన్నా వ్యవహారంపై చిట్ చాట్ చేసుకున్నారు.
రామాయణంలో పిడకల వేట మాదిరిగా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కూడా అచ్చు ఇలా నే చేస్తున్నారని గోదావరి జిల్లాలకు చెందిన ఒకరిద్దరు నాయకులు బాహాటంగానే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం మార్పు విషయంలో కన్నా లేవనెత్తిన మత మార్పిడి అంశంపై వారు ఒకిం త చురకలు కూడా అంటించారు. ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన, ఇంగ్లీష్‌లో భోదన సాగినంత మాత్రాన
మత మార్పిడులు జరిగిపోతే.. ఉన్నత విద్యను చదువు కున్నవారంతా మతాలు మార్చుకుని బైబిళ్లను పట్టుకుని ఉండేవారని, ఇది వృథా విమర్శని వారు చెవులు కొరుక్కున్నారు.
దీనివల్ల బీజేపీ ఇమేజ్ పెరగక పోగా.. కన్నాపైనే ప్రజలనే విమర్శలు ఎక్కుపెట్టారని పశ్చిమ గోదావరి కి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకింత ఘాటుగానే విమర్శించారు. ఇక, ఇప్పటి వరకు బీజేపీ అవలంబించని మీడియా ప్రాపును కన్నా చేసుకుంటున్నారని కూడా వీరు చర్చించుకోవడం గమనార్హం. జాతీయ స్తాయిలో అయినా.. ప్రాంతీయ స్థాయిలో అయినా.. బీజేపీని అనుసరించి మీడియా నడిచిందే తప్ప.. మీడియాను పట్టుకుని ఏనాడూ పార్టీ వెళ్లలేదని, కానీ, ఇప్పుడు కన్నా.. మీడియాను ఆధారం చేసు కుని వెళ్లాలని భావించడం ఏంటని కూడా అంతర్గత చర్చల్లో ఒకరిద్దరు చెప్పుకొచ్చారు.
ఇప్పటికిప్పుడు ఇది మనకు మేలు చేస్తుందని భావించినా.. ఎన్నికల సమయం వచ్చే సరికి ఓ వర్గం మీడియా ఎటు ఉంటుందో తెలియంది కాదని మరొకరు అన్నారు. సంస్తాగతంగా పార్టీని డెవలప్ చేస్తే.. ఏ సమస్యా రాదని, దీనికి జగన్ పార్టీనే ప్రత్యక్ష ఉదాహరణని వారు చర్చించుకోవడం కనిపించింది. ఏదేమైనా.. ప్రజల్లో విశ్వసనీయతను పొందేందుకు ఇలాంటి విషయాలు కాకుండా మరింత లోతుగా ఆలోచించాలని నాయకులు చర్చించుకున్నారు.