నాకూ ఆ పాస్టర్ కు సంబంధం లేదు..ఏపీ మంత్రి క్లారిటీ !

-

చంద్రబాబు కు సిగ్గు, లజ్జా లేదని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. టీడీపీకి ఒక సిద్ధాంతం లేదన్న ఆయన ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి క్రైస్తవ మత బోధకుడని అన్నారు. అతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, పోస్టింగ్ లు పెడితే ప్రభుత్వం వెంటనే అతని పై చర్యలు తీసుకుందని అయితే అతనికి, నాకు సంబంధాలు ఉన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. అధికారం పోయిన తర్వాత టీడీపీ నేతలకు మతి భ్రమించిందని, ప్రవీణ్ చక్రవర్తి మీద ఆరు కేసులు ఉన్నాయని, వాటిలో 3 కేసులను అప్పటి టీడీపీ ప్రభుత్వం కొట్టేసిందని అన్నారు.

చినరాజప్ప అప్పుడు హోంమంత్రిగా ఉన్నారన్న ఆయన అప్పుడు ఒక దళిత మహిళ ప్రవీణ్ చక్రవర్తి తనను మోసం చేశాడని ధర్నాలు చేస్తే గాని చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటి వరకు నేనెప్పుడూ  ప్రవీణ్ చక్రవర్తిని చూడలేదన్న ఆయన మా నియోజకవర్గంలో వందల మంది ఇళ్ళకు వెళుతుంటాను…ఫోటోలు దిగుతుంటారని, అలా ఫోటోలు దిగితే సంబంధాలు ఉంటాయా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news