ఫిబ్రవరి 19వ తేదిన రథ సప్తమి వేడుకలు జరగనున్నాయని ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కే రోజు సప్తవాహనాలలో భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారని అన్నారు. మాడ వీధుల్లో వాహన సేవలు… దర్శన టోకేన్లు కలిగిన భక్తులను మాత్రమే గ్యాలరిలోకి అనుమతించనున్నామని పేర్కొన్నారు. ఏకాంతంగానే చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ, ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం ఉరేగింపు, ఉదయం 11 గంటలకు గరుడ వాహనం ఉరేగింపు, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ, మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం ఉరేగింపు, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం ఉరేగింపు జరగనున్నాయి. ఇక రేపు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును కూడా విడుదల చెయ్యనుంది. అంతే కాక రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో పిభ్రవరి మాసంకు సంభందించిన వసతి గదులు కోటాను విడుదల చెయ్యనుంది టిటిడి.