రేప్ కేసులో సినీనటుడు అరెస్ట్… !

-

కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన వీరేంద్ర బాబును తాజాగా కొడిగె హళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో కన్నడ సినిమా పరిశ్రమ షాక్ కు గురి అయింది, పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక లో ఒక మహిళ వీడియో సాక్ష్యంతో సహా బయటపెట్టడంతో వీరేంద్ర బాబు దొరికిపోయాడు. ఈ మహిళను వీరేంద్ర బాబు తెలియని స్థితిలో ఉండగా ఆ నిస్సహాయ స్థితిని వాడుకుని 2021 లో తనను అత్యాచారం చేశాడని, అదే సమయంలో వీడియో కూడా తీశాడని ఆమె పోలీస్ లకు చెప్పింది. అంతే కాకుండా కొంతకాలం తర్వాత ఆ వీడియోను చూపిస్తూ రూ. 15 లక్షలు డబ్బు ఇవ్వాలని లేకుంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆమె పోలీసుల ముందు చెప్పింది.

కాగా నేరస్థుడు వీరేంద్రబాబు నటుడిగా స్వయం కృషి అనే సినిమాతో కెరీర్ ను మొదలు పెట్టాడు, పైగా ఈ సినిమాకు నిర్మాత కూడా వీరేంద్ర కావడం మరో విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news