దేశంలోనే ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ : కేటీఆర్‌

-

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రంలో సాగు, తాగు నీరు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తొలి దశలో ప్రాజెక్ట్ పూర్తిపై కొంత భయం ఉండేదని, కానీ కేసీఆర్ లాంటి దార్శనికుడికి అది పెద్ద సమస్య కాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మిషన్ భగీరథలో భాగంగా తాగు నీటికి సంబంధించి స్టడీ చేయడానికి గుజరాత్ వెళ్లామని, అక్కడి ఇంజనీర్లతో మాట్లాడామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Telangana minister KTR leaves for US to attract investments

కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్నట్లు వాళ్లతో చెబితే అంతా నవ్వారని తెలిపారు. సాక్షాత్తు ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనే వాటర్ గ్రిడ్ పథకానికి 12 ఏళ్లు పట్టిందని, అలాంటిది మూడేండ్లలో ఎలా పూర్తి చేస్తారంటూ వాళ్లంతా నవ్వారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ పట్టుదల, కార్యశీలత వల్ల అనుకున్నట్లుగానే ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. 12 ఏండ్లు తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పేరుతో ఓ 70 శాతం మందికి మాత్రమే తాగునీరు అందిస్తుంటే తాముమాత్రం ప్రతి ఇంటికి తాగునీరు అందించామని మంత్రి తెలిపారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news