కరోనా కారణంగా ప్రాణలు పోతున్న వారిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళని లేకుండా కరోనా దాడి జరుపుతూనే ఉంది. తాజాగా కరోనా ధాటికి హీరోయిన్ మాలశ్రీ భర్త, కన్నడ చిత్రాల నిర్మాత రాము స్వర్గస్తులయ్యారు. క్రోర్ పతి రాముగా అందరికీ పరిచయం ఉన్న రాము, తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ మాలశ్రీ భర్త. కరోనాతో పోరాడుతూ 52సంవత్సరాల వయస్సులో ఊపిరి వదిలారు. కన్నడ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి కోటి రూపాయల బడ్జెట్ సినిమా తీసినందుకు గాను ఆయన్ని క్రోర్ పతి రాము అంటారు.
దాదాపు 2దశాబ్దాల కాలంలో 37సినిమాలు నిర్మించారాయన. రాము గారి మరణంలో కన్నడ చిత్ర పరిశ్రమ కన్నీటి సంద్రంలో మునుగిపోయింది. శాండల్ వుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కన్నడ స్టార్ పునీత్ రాజు కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రాము గారు ఈరోజు లేకపోవడం బాధాకరం అని ట్వీట్ చేసారు. రాము గారి భార్య మాలశ్రీ, తెలుగులో పరువు ప్రతిష్ట, బావా బామ్మర్ది, అక్కా చెల్లెల్లు, పోలీస్ అల్లుడు తదితర చిత్రాల్లో నటించింది.