ఈ మహమ్మారి సమయంలో ఇలా చేస్తే పాజిటివిటీ పెరుగుతుంది..!

-

కరోనా మహమ్మారి తీవ్రంగా ఉండడంతో చాలా మంది పై ఒత్తిడి పడింది. చుట్టూ అనారోగ్య పరిస్థితులు నిజంగా అందర్నీ వేధిస్తున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించడం మరియు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ ఇలాంటివి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

సోషల్ ఐసోలేషన్ కారణంగా మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. యాంగ్జైటీ, డిప్రెషన్ మరియు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ చాలా కామన్ గా ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి సమయం లో ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం…!

ఇతరులతో కనెక్ట్ అయ్యి ఒత్తిడిని ఎదుర్కొండి:

ఒంటరిగా ఉండటం వల్ల ఎంగ్జైటీ మరింత పెరిగి పోతుంది. ఒకరితో ఒకరు ఇబ్బందులు పంచుకుంటే అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. మీరు మీ స్నేహితులతో పాటు వర్చువల్ మీటింగ్స్ ని కండక్ట్ చేసుకోండి. ఒకరి బాధని మరొకరితో చెప్పుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇతరుల మాటలు విని వాళ్ళల్లో ధైర్యం నింపండి. ఇలా ఒత్తిడి నుండి బయట పడొచ్చు.

రిలాక్స్ గా ఉండడానికి ఈ టెక్నిక్ ని పాటించండి:

సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత అవసరం. మెడిటేషన్ లాంటివి ఇటువంటి సమయంలో బాగా ఉపయోగపడతాయి. గట్టిగా శ్వాస పీల్చుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఎంగ్జైటీ లక్షణాలు తగ్గుతాయి. పైగా రిలాక్స్ గా ఉండొచ్చు.

వ్యాయామం చేయండి:

రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే సులువుగా ఒత్తిడి దూరమవుతుంది. మంచి ప్రయోజనాలని వ్యాయామం ద్వారా పొందాలంటే కనీసం రోజుకు అరగంట సేపు వ్యాయామం చేయండి. వాకింగ్, రన్నింగ్, డాన్సింగ్ లాంటివి కూడా మీకు బాగా సహాయపడుతాయి.

ఇబ్బంది పడొద్దు:

మీరు ఇప్పటివరకు ఇబ్బందుల గురించి ఆలోచించి ఆలోచించి విసిగిపోయి ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఏమీ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఇటువంటి ఆలోచనలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.

మీలో మీరు మాట్లాడుకోవడం:

మీరు ఇబ్బంది గురించి మాత్రమే ఆలోచించడం మానేసి వాటికి చాలెంజ్ గా మీరు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కాస్త ధైర్యంగా అడుగులు వేయండి. ఇటువంటి ఘోరమైన పరిస్థితి నుంచి బయట పడడానికి కాస్త కొత్తగా ఆలోచించి ఆందోళన నుంచి బయటపడండి.

Read more RELATED
Recommended to you

Latest news