చిత్ర పరిశ్రమలో మరో విషాదం… ప్రముఖ నటి ఆత్మహత్య

-

చిత్ర పరిశ్రమ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు.  ఇక తాజాగా ప్రముఖ కన్నడ సీరియల్ నటి సౌజన్య సూసైడ్ చేసుకుంది. తీవ్ర డిప్రెషన్ కు గురైన నటి సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు శాండల్వుడ్ ను ఉలికిపాటుకు గురిచేసింది. కన్నడ సీరియల్స్ తో పాపులర్ అయిన సౌజన్య గురువారం బెంగుళూరులోని తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకుంది.

తన గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే సూసైడ్ చేసుకున్న సౌజన్య… ఓ లెటర్ కూడా రాసింది. తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ… తాను తీవ్ర డిప్రెషన్ కు గురైనట్లు సూసైడ్ నోట్లో స్పష్టంచేసింది సౌజన్య. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె మరణం వెనుక ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news