కాంతారా చాప్టర్ 1 టీజర్ మామూలుగా లేదుగా..!

-

కాంతారా చాప్టర్ 1 సినిమాపై బిగ్ అప్డేట్‌ వచ్చేసింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్‌ లుక్‌తో పాటు మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. నిన్న ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకాలోని ఆనెగుడ్డె ఆలయంలో చిత్ర బృందం ‘కాంతారా చాప్టర్ 1’ చిత్రం మొదటి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా తెలుగుకి సంబంధించిన టీజర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు.

కదంబ కాలం నాటి కథతో కాంతారా చాఫ్టర్‌ 1 సినిమా ఉంటుందని చిత్రబృందం టీజర్‌లో తెలిపింది. పోస్టర్స్‌ లో, టీజర్‌లో రిషబ్ శెట్టి లుక్‌ అదిరిపోయింది. తన ఇంటెన్స్‌ లుక్‌తో అందరినీ భయపెట్టాడీ ట్యాలెంటెడ్‌ హీరో అండ్‌ డైరెక్టర్‌. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఖడ్గంతో ఒక బావిలో నిలబడి కనిపించాడు రిషబ్‌ శెట్టి. ఇక కన్నడతో పాటు ఏడు భాషల్లో టీజర్ అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్‌లో మీకు నచ్చిన భాషలో టీజర్‌ను చూడవచ్చు. కాగా కాంతారా సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తొలుత కేవలం కన్నడలో భాషలోనే రిలీజైన ఈ సినిమా ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో డబ్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు కాంతారా ఛాప్టర్‌ 1 సినిమా కేవలం కన్నడలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news