చిరంజీవి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వివాదాస్పద నటుడు…!

-

ఈ మధ్యన త్రిష మరియు మన్సూర్ ల మధ్యన ఒక వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో మన్సూర్ అలీ ఖాన్ దే పొరపాటు అన్న విషయం అందరికీ అర్థమైంది.. అతను కూడా చివరికి త్రిషకు క్షమాపణలు చెప్పాడు. ఈ ఒక్క వివాదంతో అతను తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు బాగా పాపులర్ అయ్యాడు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి త్రిషకు మద్దతుగా నిలిచినందుకు గాను ఆయనపై మన్సూర్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. మన్సూర్ మాట్లాడుతూ చిరంజీవి ప్రతి సంవత్సరం హెరొఇనెస్ తో కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు, నేను కూడా ఆయనతో నటించిన వాడినే.. కానీ నన్నెప్పుడూ పిలవలేదు అంటూ కీలక విషయం బయటపెట్టాడు..

ఆయనకు కేవలం హీరోయిన్ లతో పార్టీలు చేసుకోవడం మాత్రమే ఇష్టమని ఖరాఖండీగా చెప్పేశాడు మన్సూర్. ఈ వ్యాఖ్యల పట్ల చిరంజీవి ఫ్యాన్స్ ఏమైనా రియాక్ట్ అవుతారా అన్నది చూడాలి. ఇక చిరు తో పాటు చాలా మంది త్రిషకు మద్దతు తెలిపినప్పటికీ మన్సూర్ మెగాస్టార్ ను టార్గెట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news