భారత లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌కు గుండెపోటు వచ్చింది.. దీంతో అతని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు..ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు..ఐసీయూలో ఉంచి కపిల్ దేవ్‌కు చికిత్స అందిస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ మరియు ప్రపంచంలో అత్యుత్తమ ఆల్ రౌండర్ క్రికెట్‌లో కపిల్ దేవ్ ఒకరు..1983 ప్రపంచకప్పులో అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ ప్రపంచకప్పు సాధించడంతో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు..లార్డ్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శక్తివంతమైన వెస్టిండీస్‌ను ఓడించి ప్రపంచకప్పును సొంతం చేసుకుంది భారత్..భారత ప్రపంచ కప్ విజయంలో దేవ్ 12 వికెట్లు పడగొట్టగా, 60.6 సగటుతో 303 పరుగులు చేశాడు. అంతేకాకుండా, ఏడు క్యాచ్‌లు కూడా అతను పట్టుకున్నాడు.. ప్రస్తుతం..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020లో కపిల్ దేవ్ క్రికెట్ గురించి తన అభిప్రాయాలతో చాలా చురుకుగా ఉన్నాడు.
క్రికెటర్ కపిల్ దేవ్‌కు గుండెపోటు..ఢిల్లీలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స.
-