బీజేపీ నేత కపిల్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ఇండియా టీవీ చెర్మన్, ఎడిటర్ రజత్ శర్మ ట్వీట్‌పై స్పందించిన కపిల్ మిశ్రా.. 6 వేల మంది తబ్లిగీల ఆచూకీ ఇంకా తెలియడం లేదని చెప్పారు. కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకునేందుక వారు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదన్నారు. అందులో చాలా మంది ఫోన్లు ఆపివేయబడ్డాయని చెప్పిన ఆయన.. వారి ఉద్దేశాలు ఏమిటో అర్థం కావడం లేదన్నారు. వారిని దాచడానికి ఎవరు సాయం చేస్తున్నారని ప్రశ్నించారు.
అంతకుముందు రజత్ శర్మ.. ‘ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు 9 వేల మందికి పైగా హాజరయ్యారు. ఇప్పటివరకు దేశంలో 3,193 మంది తబ్లిగీ సభ్యులను కనుగొన్నారు. ఇందులో 765 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీలో 900 మందిని ఇళ్లు, మసీదుల నుంచి పోలీసులు తరలించారు. అయితే మిగిలిన 6,000 మంది ఎక్కడున్నారు?’ అని ట్వీట్ చేశారు. దీనికి రీట్వీట్ చేసిన కపిల్ మిశ్రా వారు ఏమయ్యారని ప్రశ్నించారు.
కాగా, దేశవ్యాప్తంగా మర్కజ్ ఘటనతో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటివరకు ఇండియాలో 9,325 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో 324 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
6000 तबलीगी जमात के लोग अभी भी गायब हैं
ये खुद सामने नहीं आ रहे, इनके फोन बंद हैं
इनका इरादा क्या हैं?इन्हें छिपने में मदद कौन कर रहा हैं? https://t.co/MxVSRBnwkx
— Kapil Mishra (@KapilMishra_IND) April 13, 2020