ఇలాంటప్పుడు బ్యాంకులు అండగా నిలబడకపోతే సామాన్యుడు ఏమైపోతాడు ?

-

ప్రపంచ దేశాలు అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ని అరికట్టేందుకు భారతదేశం లాక్ డౌన్ అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పగడ్బందీగా లాక్ డౌన్ నీ అమలు చేయడం జరిగింది. దేశంలో ఉన్న ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. అన్ని రంగాల్లో మూతపడటంతో పాటు ప్రజలంతా ఇళ్లకి పరిమితమయ్యారు. దీంతో ప్రజలు అనేక వస్తువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రోజుకి ఆ రోజు బతికే సామాన్యులు పని లేకపోవటంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి చేయి చాచి పరిస్థితి ఏర్పడింది. చాలా మంది దాతలు విరాళాలు మరియు సహాయాలు రూపంలో దేశంలో చేయటంతో అనేకమంది తమ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.RBI 3 Months Moratorium on Loan EMI - Do I Need to Take Advantage?అయితే ఉద్యోగాలకు వెళ్లలేక జీతాలు తీసుకోకపోవడంతో చాలామంది కేంద్ర ప్రభుత్వాన్ని లాక్ డౌన్ విధించిన సమయంలో ఈఎమ్ఐ లు ఈ విషయంలో కేంద్రాన్ని వాయిదా వేయాలని అనేకమంది ప్రజలు దేశవ్యాప్తంగా కోరడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ తో మాట్లాడి పరిస్థితిని వివరించి ఈఎమ్ఐ లు మూడు నెలల పాటు కట్టనవసరం లేదు అని తెలిపింది. దీంతో అందరూ హ్యాపీ అనుకున్న టైమ్ లో ప్రజలకు భారీ షాక్ తగిలింది. రిజర్వ్  బ్యాంకు ఆదేశాలను జాతీయ బ్యాంకులు సహా ప్రైవేటు బ్యాంకులు ఆర్థిక సంస్థలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

 

ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుడు నుండి మారటోరియం అవసరం లేదు అని రాసిస్తే తప్ప అకౌంట్లో డబ్బులు కట్ చెయ్యవద్దు అని అన్ని బ్యాంకులకు సూచించింది. కానీ ఒక్క బ్యాంకు కూడా దీన్ని అమలు చేయలేదు. ప్రైవేటు బ్యాంకులే కాదు జాతీయ బ్యాంకులు సైతం రిజర్వు బ్యాంకు ఆదేశాలను బేఖాతరు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులు బ్యాంకులపై మండిపడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో కూడా బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకు అండగా లేకపోతే ఇంకెందుకు అని తీవ్ర స్థాయిలో బ్యాంకులపై మండిపడుతున్నారు. ఈ విధంగా బ్యాంకులు వ్యవహరిస్తే సామాన్యుడు భయంకరంగా నష్టపోతున్నారు అని చాలామంది అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news