చిన్నప్పటి ఫోటోలు పోస్ట్ చేసిన అగ్ర హీరోయిన్లు, ఎలా ఉన్నారో చూడండి…!

-

సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల పట్ల సహజంగానే అందరికీ ఆసక్తి ఉంటుంది. వారు మాత్రమే కాకుండా వారు చేసే ప్రతి చిన్న పనికి కూడా అందరూ ఒక ప్రత్యేక స్థానం ఇస్తుంటారు. ఎందుకంటే వారు సమాజంలో ఒక ప్రత్యేక స్థానం పొందిన వారు కాబట్టి అందరిలోనూ ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. అలాగే సెలబ్రిటీ లకు సంబంధించిన ఏ వార్త అయిన, ఏ ఫోటో అయినా కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం.

ఆ కోవకు చెందినదే బాలీవుడ్ నటిమణులు, మరియు అక్కా చెల్లెళ్ళు అయిన కరీష్మా కపూర్, మరియు కరీనా కపూర్ కు సంబంధించిన వారి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది. ఈ ఫొటోలో వీరిద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోను వారి అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. కరిష్మా కపూర్ 90లలో బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

తన అక్క వారసత్వాన్ని అందుకున్న కరీనాకపూర్ కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించడమే కాకుండా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. కరీష్మా కపూర్ కొంతకాలం క్రితం వెండితెరకు దూరమై తాజాగా డిజిటల్ మీడియాలో అరంగేట్రం చేశారు. సహనటుడు సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకునీ ఒక బిడ్డకు తల్లైంది కరీనా. తాజాగా కరీనా కపూర్ నటించిన ఇంగ్లీష్ మీడియం చిత్రం ఇటీవలే విడుదలైంది. ఒక బిడ్డకు తల్లైనప్పటికి బాలీవుడ్ లో కరీనా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Read more RELATED
Recommended to you

Latest news