తెలుగింటి ముద్దుబిడ్డకు దేన రాజధానిలో అరుదైన గౌరవం

-

న్యూఢిల్లీ: తెలుగింటి బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ దిగ్గజం కరణం మల్లీశ్వరికి ఢిల్లీ స్ట్పోర్స్ యూనివర్సిటీ వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించిన తొలి మహిళ కరణం మళ్లీశ్వరి. దేశంలోనే తొలి స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఢిల్లీ ప్రభుత్వం.. ఢిల్లీ జిల్లా ముండ్కా పట్టణంలో నిర్మించింది. ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో ఐదేళ్లలో 25, పదేళ్లలో 50 పతకాలు సాధించే లక్ష్యంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్న కేజ్రీవాల్ ప్రకటించారు. క్రీడాకారులు ఏ ఆటలో రాణించాలని ఆశిస్తారో అందులోనే డిగ్రీ చేసేలా ఈ వర్సిటీలో కోర్సులు ఉంటాయి. స్పోర్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రముఖులను నియమించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు స్పోర్స్ యూనిర్సిటీకి వీసీగా కరణం మల్లీశ్వరిని నియమించారు.

కాగా శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్‌లో మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం తరపున కాంస్యపతకం సాధించారు. మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంశెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు . అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు . చివరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు.

చైనా దేశం గ్యాంగ్ ఝూలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 54 కిలోల విభాగంలో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చారు. ఆ తరువాత టర్కీ రాజధాని ఇస్తాంహుల్‌లో జరిగిన పోటేల్లో తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువుకావడంతో ఆ టైటిల్‌ను మల్లీశ్వరికి ప్రదానం చేశారు. 1995 చైనాలో జరిగిన పోటల్లో వరుసగా 105,110, 113, కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ – లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును మల్లీశ్వరి బద్దలు కొటారు .సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించారు. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news