ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 9,11తరగతుల ఫలితాలు విడుదల.. 80శాతానికి పైగా పాస్.

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని 2020-2021సంవత్సరానికి గాను 9వ తరగతి, 11వ తరగతి ఫలితాలను వెల్లడి చేసింది. ఈ ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ edudel.nic.in లో కూడా చూడవచ్చు.

ఈ ఫలితాలను డైరెక్టుగా విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాఒ నంబర్లకే పంపించింది. ఫలితాల కోసం ఎవరూ పాఠశాలకి రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. 2020-21 సంవత్సరంలో 9 వ తరగతిలో సుమారు 2.58 లక్షల మంది విద్యార్థులు చేరారు. అందులో 2.45లక్షల మంది మాత్రమే మధ్యంతర పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా 1.97 లక్షల మంది విద్యార్థులకు పదోన్నతి లభించింది. దీన్ని బట్టి ఫలితాల శాతం 80.3శారానికి చేరింది.

అదేవిధంగా 11 వ తరగతిలో 1.70 లక్షల మంది విద్యార్థులు చేరారు. అందులో 1.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 1.65 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఉత్తీర్ణత శాతం 96.9% గా ఉంది. ఈ ఫలితాలు మిడ్ టర్మ్ పరీక్షలు, ప్రాజెక్ట్ అసెస్ మెంట్ ఆధారంగా ఇచ్చారు. ఇదిలా ఉంటే 2020-21సంవత్సరంలో 9వ తరగతి వారికి సాంఘీక అధ్యయనం, మూడవ భాషా పరీక్షలు నిర్వహించలేదు. అలాగే 11వ తరగతై వారికి వ్యాపార సంబంధిత సబ్జెక్టు క్లాసులు జరగలేదు.

అందువల్ల ఇక్కడ ఉత్తమ సగటు మార్కులను అందించారు. ఇంకా, 9వ తరగతిలో మధ్యంతర పరీక్షలో హాజరు కాని విద్యార్థులు 12500మంది ఉన్నారు. 11వ తరగతిలో మధ్యంతర పరీక్షలకు హాజరు కాని వారు 3500మంది ఉన్నారు. వీరికి ప్రాజెక్ట్ ఆధారిత అసైన్ మెంట్ ఉండనుంది. దానికి సంబంధించిన వివరాలను మరికొన్ని రోజుల్లో వెల్లడి చేయనున్నారు. ఈ సమాచారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్ సైటులో అప్లోడ్ చేస్తారు.