అంబులెన్స్ రెడీగా ఉంచుకోండి.. ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్‌కు బీజేపీ వ్యంగ్యాస్త్రాలు

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గుందని అంచనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. దీనిపై బీజేపీ నేత అమిత్‌ మాలవీయ వ్యంగ్యంగా స్పందించారు. అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

‘ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలుపుపై ఆశ పెట్టుకున్న వారి సంబరాలు చూస్తుంటే సరదాగా ఉంది. అవి ఎగ్జిట్ పోల్స్‌.. నిజమైన ఫలితాలు కావు. కాంగ్రెస్ శ్రేణులకు నాదో సలహా.. ఎందుకైనా మంచిది మీరు అంబులెన్సులు దగ్గర ఉంచుకోండి. ఫలితాలు తారుమారు కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. అప్పుడవి ఉపయోగపడతాయి’ అని మాలవీయ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తోసిపుచ్చారు. ‘క్షేత్రస్థాయి నుంచి మాకు అందిన సమాచారం స్పష్టంగా ఉంది. 100 శాతం మాకు మెజార్టీ వస్తుంది’ అని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news