120 స్థానాల్లో కాంగ్రెస్ హవా.. పార్టీ ఆఫీసుల్లో నేతల సంబురాలు

-

దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తన హవా చూపిస్తోంది. ఇప్పటి వరకు 120పైకి స్థానాల్లో తన సత్తా చూపిస్తోంది. 120కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవడానికి కాస్త దగ్గరలోనే ఉంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. డ్యాన్సులు చేస్తూ.. డప్పులు వాయిస్తూ.. మిఠాయిలు పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

మరోవైపు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిమ్లాలోని హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ, కర్ణాటక ప్రజల శాంతి, సామరస్యం కోసం ప్రార్థించారు. బెంగళూరులోని కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇంటి ఎదుట నేతలు బాణసంచా పేల్చుతూ సంబురాలు చేసుకున్నారు. కార్యకర్తలకు స్వీట్లు పంచి పెడుతూ ఆధిక్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news