నన్ను బెదిరించాలని ట్రై చేయకండి.. జర్నలిస్టులకు DK శివకుమార్ వార్నింగ్

-

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్​కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆయన జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. తనను బెదిరించాలని చూడకండి అంటూ హెచ్చరించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బుధవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నుంచి ప్రాంతీయ విలేకరులంతా వెళ్లిపోయారు. శివకుమార్‌ గంట ఆలస్యంగా సమావేశానికి హాజరు కావటమే దీనికి కారణం. బయలు దేరే సమయానికి శివకుమార్‌ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో సమావేశానికి గంట ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన జర్నలిస్టులంతా ఈ సమావేశాన్ని కవర్‌ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అనంతరం దీనిపై ఆయనతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

‘మీ దగ్గర గడియారాలు ఉన్నంత మాత్రాన అన్ని సమయానికి జరగవు. సమావేశాన్ని ఏ సమయంలో ఏర్పాటు చేయాలో.. దానికి మీరంతా ఎప్పుడు వస్తారో నాకు బాగా తెలుసు. నన్ను బెదిరించాలని చూడకండి’ అని అన్నారు. అనంతరం శివకుమార్‌ మీడియా కో ఆర్డినేటర్‌ను విలేకరుల పేర్లను ఇవ్వాలని కోరారు. వారి యాజమాన్యంతో మాట్లాడతానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news