కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు స్పందిస్తున్నాయి. మేమే అధికారంలోకి వస్తామంటే మేమే అధికారంలో వస్తామంటూ బీజేపీ, కాంగ్రెస్ లు మాటల యుద్ధం కొనసాగిస్తుండగా.. జేడీఎస్ మాత్రం సైలెంట్ గా ఉంది.
తాజా సమాచారం మేరకు కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. అయితే కీలకంగా మారనున్న జేడీఎస్ కూడా మెరుగ్గా రాణిస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. తనను ఇప్పటి వరకు ఎవరూ కాంటాక్ట్ కాలేదని చెప్పారు. తనకు డిమాండ్ లేదని, తనదో చిన్న పార్టీ అని కుమారస్వామి అన్నారు. రాబోయే 2-3 గంటల్లో క్లారిటీ వస్తుందని, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్టీలే భారీగా స్కోర్ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మంచి అభివృద్ధి సాగుతుందని ఆశిస్తున్నట్లు కుమారస్వామి తెలిపారు.