ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఇంటర్​ ప్రవేశాలు

-

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 30 నాటికి అడ్మిషన్లు పూర్తి చేయాలని.. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు షెడ్యూలు విడుదల చేసింది.

ఒక్కో సెక్షన్‌లో 88 మంది విద్యార్థులు మించరాదని.. అనుమతి లేకుండా అదనపు సెక్షన్లు పెడితే కళాశాల అనుమతి రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే చేరాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు. జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఈ మేరకు ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్​ను బోర్డు విడుదల చేసింది. మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 15న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. జూన్‌ 30 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని.. రెండో విడత ప్రవేశాల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news