‘ఫ్రీ కరెంట్ అన్నారుగా.. మేం బిల్లు కట్టం’.. కర్ణాటక కాంగ్రెస్ కు షాక్..

-

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో రకాల హామీలు ఇస్తాయి. ఒక్కసారి అధికారంలోకి రాగానే అన్నింటిని మరిచిపోతాయి. ప్రజలు కూడా ఈ రాజకీయ నాయకులు ఇంతేనని కాంప్రమైజ్ అయిపోతుంటారు. కానీ కర్ణాటక ప్రజలు మాత్రం అలా కాదు. ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని నేతలు నిలబెట్టుకునేలా ప్రయత్నిస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురువేసి.. ఈరోజే సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ కు ప్రజల నుంచి ఓ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కొప్పల్‌, కలబురిగి, చిత్రదుర్గ జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. కరెంట్‌ ఛార్జీలు చెల్లించాలంటూ వెళ్లిన అధికారులను ప్రశ్నిస్తున్నారు.

అధికారంలోకి వస్తే ఉచితవిద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది కదా.. ఇప్పుడు మళ్లీ బిల్లు ఎందుకు కట్టమంటున్నారంటూ నిలదీస్తున్నారు. మీటరు రీడింగులు తీసేందుకు వెళ్తున్న విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికీ దాదాపు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news