‘ఉగ్రవాదానికి కాంగ్రెస్ అండ’.. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోదీ

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రచారాణికి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రంగలోకి దిగారు. శుక్రవారం రోజున మోదీ కర్ణాటకలోని బళ్లారి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

ఉగ్రవాదంపై తెరకెక్కించిన ది కేరళ స్టోరీ సినిమాను వ్యతిరేకించి.. కాంగ్రెస్ పార్టీ ముష్కరుల పక్షాన నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ.. ఉగ్రవాదానికి రక్షణగా నిలిచిందని ఆరోపించారు. ఉగ్రవాదులకు తలవంచిన పార్టీ రాష్ట్రాన్ని ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. కర్ణాటకను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మార్చే రోడ్మ్యాప్ తమ వద్ద ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం అబద్ధాలు, నిషేధాలతో నిండిపోయిందని మండిపడ్డారు.

“కాలంతో పాటు ఉగ్రవాదం తీరు మారుతోంది. బాంబులు, తుపాకుల శబ్దాలు లేకుండా ఉగ్రవాదం వ్యాప్తి చెందుతోంది. దీనిపై కోర్టులు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మధ్య ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాపై చర్చ జరుగుతోంది. ఓ రాష్ట్రంలోని ఉగ్రకుట్రల గురించి ఆ చిత్రంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది.”

– నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news