దేశం మొత్తం ఇప్పుడు కర్ణాటకలోని హిజాబ్ అంశంపై ఎక్కువగా ఆసక్తికనబరుస్తున్నారు. కర్ణాటకలో చిన్నగా మొదలైన ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కర్ణాటకలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి. తన మతాచారాలకు అనుగుణంగా హిజాబ్ ధరిస్తామని ఓ వర్గం విద్యార్థులు అంటుంటే.. మరో వర్గం విద్యార్థులు అభ్యంతరం చెబుతూ.. కాషాయ కండువాలతో తరగతులకు హాజరవుతున్నారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో ఈ వివాదంపై అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ కర్ణాటకలోని హిజాబ్ అంశంపై స్పందించింది. ‘బికినీ, ఘూంఘట్, జీన్స్, హిజాబ్’ ధరించే హక్కు మహిళలకు ఉందని చెప్పారు. కర్ణాటకలో హిజాబ్ ధరిస్తున్న అమ్మాయిలకు నా మద్దతు ఉంటుందని ప్రియాంకగాంధీ అన్నారు. ఇటీవల ఈ అంశంపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మాత సరస్వతి అందర్ని ఒకేటా చూస్తుందంటూ.. ట్విట్ చేశారు.