మళ్లీ మొదలైన చైనీయుల లోన్ యాప్ దోపిడీ.. గుట్టురట్టు చేసిన బెంగళూరు పోలీసులు

-

చైనా ముఠాలు మళ్లీ చెలరేగిపోతున్నాయి. లోన్ యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు కస్టమర్లకు లోన్లు ఇస్తూ దోచుకుంటున్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత వివరాలను స్నేహితులు, బంధువులకు పంపుతూ మాన హననానికి పాల్పడుతున్నాయి. అలాంటి ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు.

అధిక వడ్డీలకు రుణాలను ఇస్తూ కస్టమర్లను వేధిస్తున్న చైనా జాతీయులకు చెందిన యాప్ లోన్ ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. దేశ చట్టాలకు విరుద్ధంగా విపరీతమైన వడ్డీలకు రుణాలను ఇస్తూ కస్టమర్లను వేధించడమే కాకుండా మాన హననం చేస్తున్నట్లు బెంగళూరు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. భారత పౌరుల పేరిట చైనా జాతీయులు బ్యాంక్ ఖాతాలను తెరవడమే కాకుండా మోసపూరితమైన ట్రాన్సక్షన్ నిర్వహించి, రూ.కోట్లను చైనాలోని బ్యాంక్ ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. కంపెనీకి చెందిన టీమ్ లీడర్ దర్శన్ చౌహన్(21), హెఆర్ ఎగ్జిక్యూటివ్ కామరాజ్ మోర్(25)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు‌లోని మారతహళ్లి‌లో లికోరైస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట యాప్ లోన్ రాకెన్‌ను నడుపుతున్న చైనా జాతీయుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు.

పోలీసుల వివరాల ప్రకారం చైనా జాతీయులు ఫైనాన్స్ కంపెనీని నిర్వహిస్తూ ప్రజలకు రుణాలను ఇస్తున్నారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, విపరీతమైన వడ్డీలు వేస్తూ వినియోగదారులను వేధిస్తున్నారు. అంతేకాకుండా రుణాలను తీసుకున్న వారి స్నేహితులు, బంధువులకు లోన్ వివరాలను పంపుతూ మాన హననానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆఫీస్‌పై దాడి చేసిన పోలీసులకు చైనా జాతీయులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ‘క్యాష్ మాస్టర్’, ‘క్రేజీ రూపీస్’ పేరిట రుణ యాప్‌లను రూపొందించి లోన్లను ఇస్తున్నట్లు తేలింది.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ పేరిట కంపెనీని ఏర్పాటు చేసి యాప్స్ ద్వారా ప్రజలకు రుణాలను ఇస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ప్రాసెసింగ్ పేరిటనే విపరీతంగా డబ్బులు కస్టమర్ల నుంచి డబ్బులు గుంజుతారు. ఒక్కసారి వినియోగదారుడి ఖాతాలో డబ్బులు జమ కాగానే కంపెనీ ప్రతినిధులు వినియోగదారులకు ఫోన్, ఇంటర్నెట్ కాల్స్ చేస్తూ వారం వారీగా విపరీతమైన వడ్డీలు విధిస్తూ కష్టమర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

అంతేకాకుండా, కంపెనీ సిబ్బంది నుంచి ఆధార్, పాన్ కార్డ్స్ తదితర డాక్యుమెంట్స్‌ను సేకరించి, ఒక్కక్కరి పేరిట ఐదును ఆరు కంపెనీలను చైనా జాతీయులు రిజిస్టర్ చేసినట్లు వెల్లడైంది. దాదాపు 52 కంపెనీలను రిజస్టర్ చేసి, వారిపైన ప్రైవేట్ బ్యాంకులలో ఖాతాలను తెరిచారు. వీటిలోనే వినియోగదారులు చెల్లించే వడ్డీలు క్రెడిట్ అయ్యేవి. ఈ ఖాతాల నుంచి రూ.కోట్లను చైనాకు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసినట్లు వెల్లడైంది.

బోగస్ కంపెనీల ద్వారా కంపెనీలను స్థాపించడంతోపాటు ముఖ్యం ఉత్తర భారతీయులను టార్గెట్ చేసి, విపరీతమైన వడ్డీలతో దోచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news