రైతులు చనిపోతుంటే .. కేసీఆర్ ఢిల్లీలో పార్టీలు చేసుకుంటున్నాడు- రేవంత్ రెడ్డి.

-

వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్క్ వేదికగా నేడు, రేపు వరి దీక్షలు చేస్తోంది. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కల్లాల్లో రైతులు చనిపోతుంటే.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి పార్టీలు చేసుకున్నాడని విమర్శించారు. రైతులు ధాన్యం అమ్మకం కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.

రైతులపై కేసీఆర్ కక్ష కట్టాడని అన్నారు రేవంత్ రెడ్డి. రైతులు గోస పడుతున్నా.. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ఎందుకు ప్రధానిని నిలదీయలేదని ప్రశ్నించారు. వరి రైతులు ఉరేసుకోవడానికే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ ఇలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలే అని అన్నారు రేవంత్ రెడ్డి. వరి ధాన్యం కొనుగోలు చేతకాకపోతే కేసీఆర్ గద్దె దిగాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రూ.10 వేల కోట్లు ఇస్తే మేమే రైతుల చివరి ధాన్యం గింజవరకు కొంటామని… రైతులకు మద్దతు ధర రూ. 1950 అందించడే కాకుండా 550 బోనస్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news