కార్తీకదీపం సెప్టెంబర్ 22 ఎపిసోడ్ 1151: US వెళ్లేందుకు కార్తీక్ ప్లాన్స్..జైల్లో ఉండే పెద్ద స్కెచ్చ్ వేస్తున్న మోనిత

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో జైల్లో మోనిత తెల్లచీరకట్టుకుని జైలు గోడలపై నా కార్తీక్ అని రాసుకుంటుంది. ఆ పేర్లతో కార్తీక్ తో మాట్లాడినట్లు..బంగారం ఈ చీరలో నేను ఎలా ఉన్నాను, అద్దిరిపోలా అనుకుంటూ..ఈ జైల్లో 18 నెలలు నీకు దూరంగా ఉండాలా బంగారం ..ఉంటాను 36నెలలు అయినా సరే నీ నామ స్మరణతో హ్యాపీగా ఉంటాను అనుకుంటూ…తనలో తనే పిచ్చిదానిలా మాట్లాడుకుంటుంది. ఇంతలో రౌండ్స్ కి వచ్చిన కానిస్టేబుల్ వచ్చి ఆ పేర్లను చూసి ఎవరూ మేడమ్ ఆయన అని అడుగుతుంది. నాకు కాబోయే ఆయన..నా బిడ్డకు తండ్రి అని చెబుతుంది. కానిస్టేబుల్ కి ఏం అర్థంకాదు. అలా ఏదో ఏదో చెప్తుంది మోనిత..కానిస్టేబుల్ లో మనసులో మా జైలర్ ఇది వెరైటి కేసు అంటే ఏదో అనుకున్నా నిజమే అనుకుంటుంది. పనుందని వెళ్తుంది.

ఆరోజు రాత్రి సౌందర్యకు పిల్లలు ఇద్దరు వేళ్లు లాగుతూ ఉంటారు. నిద్రరావటం లేదని పిల్లలు సౌందర్యను ఏమైనా కబుర్లు చెప్పమంటారు. సౌందర్య త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి అంటుంది. శౌర్య తెలియని విషయాలు చెప్పమంటారు. సౌందర్య చిన్నతనం గురించి అడుగుతారు. సౌందర్య తనది మంగళగిరి దగ్గర అంటుంది. అలా అలా చెప్తూ..ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు..బంధాలు ముఖ్యం అంటుంది. శౌర్య, హిమా మెల్లిగా పాయింట్ లోకి వస్తారు. మీరు చెప్పినవి అన్నీ అబద్ధాలు అని తెలిసినా నమ్మాం, నమ్మినట్లు నటించాం, అమ్మానాన్నలను సెల్, లాప్ టాప్ ల పంచుకున్నాం అంటారు. సౌందర్య వాళ్లకు అర్థమయ్యేలా చెప్తుంది. కానీ ఆ పిల్లలు ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తుంది. ఈ సీన్ చాలా లాగ్ అనిపిస్తుంది. ఇక ఎప్పటికి అందరం కలిసే ఉంటాం అంటుంది..ఇంతలో ఆనంద్ రావు తుమ్ముతాడు. అలా ఆ సీన్ అయిపోతుంది.

ఇంకోవైపు దీప తన జీవితంలో జరిగిన ఘటనలు గుర్తుచేసుకుంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు..కింద కుర్చుంటాడు. దీప డాక్టర్ బాబు మీరు ఇలా నేల మీద కుర్చోటం నాకేం బాలేదు అంటుంది. మనోడు ఒక వేదాంతం చెప్తాడు..స్రీ ఇలా ఉండాలని చెప్పారే కానీ..మగాడు ఇలా ఉండాలని ఎక్కడా చెప్పలేదు అంటాడు. ఏంటి డాక్టర్ బాబు ఇలా మాట్లాడుతున్నారు అంటుంది దీప . మన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో కదా అని కార్తీక్ కూడా గతంలో జరిగిన ఘటనలు గురించి చెప్తాడు. తుఫాను వెలిసినట్లు ఉంది, కొత్తగా మొదలెట్టినట్లుగా సరికొత్తగా మొదలుపడదాం అంటాడు. దీప..ఇది అంతం కాదు, తుఫాను వెలిసినా దారిమార్చుకుని మళ్లీ రావొచ్చు అంటుంది. కార్తీక్ ఆ మోనితకు శిక్ష పడింది, తను జైల్లో ఉంది కదా అంటాడు. 18 నెలలు ఎంతలో గడిచిపోతాయ్, తన కడుపులో బిడ్డతో సహా ఇంటికొస్తే.. మన బిడ్డలకు ఏం చెప్తాం, మనం చెప్పడానికి ఏం ఉండదు, మనం అబద్ధం చెప్పినా ఆ మోనిత నిజం చెప్పేస్తే….మన బంధాలను పదిలంగా కాపోడుకోవాలంటే పిల్లకు ఇప్పుడే నిజం చెప్పేస్తే అంటుంది. కార్తీక్ ఆపు దీప..పిల్లలకు ఏం చెప్తాం, నువ్వేం చెప్తాం వాళ్లేం అర్థంచేసుకుంటారు..ఈ మురికి విషయాన్ని వాళ్లకెలా చెప్తాం..నిజం చెప్పటానికి నీకు ఎందుకు అంత ఉత్సాహం దీప. ఆ మోనిత బిడ్డను కని ఇక్కడికి వచ్చేలోగానే మనం అందరం యూఎస్ వెళ్దాం, అందుకు తగిన ఏర్పాట్లు ఏవో నేను చూసుకుంటాను.. ఇదే ఫైనల్ అని చెప్పి వెళ్తాడు

మరుసటి రోజు ఉదయం మోనిత జైల్లో నిద్రలో కూడా కార్తీక్ అని కలవరిస్తుంది. కానిస్టేబుల్ వచ్చి లేవాలి లేవాలి అని లేపుతుంది. అప్పుడు ఈ మోడమ్ గారు లేచి..ఏం తెలియనట్లు నేనెక్కడ ఉన్నాను..జైల్లో ఉన్నాను కదా అనుకుని గోడలపై రాసిన పేర్లకు గుడ్ మార్నింగ్ అని చెప్పి మళ్లీ తనలో తనే మాట్లాడుతుంది. ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో ఆ దీప నిన్ను మార్చేస్తే..నన్ను మర్చిపోయేలా చేస్తే..అయ్యోయ్యే ఇంత మంచి పాయింట్ ని నేను ఎలా మర్చిపోయాను, 18నెలలు నాకు తక్కువ టైం..కార్తీక్ ఫ్యామిలీకి ఎక్కువ టైం, కుటుంబం అంతా కలిసి కార్తీక్ మనసు మారిస్తే..చేస్తే ఏంటి చేస్తారు..వాళ్లకి అంత టైం ఇవ్వనుగా ఇస్తే మోనితను ఎలా అవుతాను అంటూ చిటికెలేసుకుంటుంది. దీన్ని బట్టి మోనిత జైల్లో కూడా ఏదో పెద్ద స్కెచ్చే వేసినట్లు ఉంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news