కార్తికేయ “బెదురులంక” స్పెషల్ టీజర్ రిలీజ్

-

ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరో కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బెదురులంక 2012. ఈ చిత్రంలో డీజే టిల్లు సినిమాతో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును అందుకున్న కలర్ ఫోటో నిర్మాతలలో ఒకరైన రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ త్రీ గా బెనర్జీ దీనిని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. సి యువరాజు ఈ చిత్ర సమర్పకులు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పవచ్చు. అలాగే ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బి శ్రీరామ్, సురభి ప్రభావతి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండి స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ టీజర్ లోని యాక్షన్స్ సన్నవేశాలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news