బెజవాడ టీడీపీలో రచ్చ..కేశినేని తగ్గట్లేదు.!

-

బెజవాడ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తగ్గట్లేదు..నేతల మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే వారి మధ్య పోరు వల్ల బెజవాడలో టీడీపీకి నష్టం గట్టిగానే జరిగింది. అయినా సరే నేతల్లో మార్పు రావడం లేదు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు రాజకీయం చేస్తున్నారు. పైగా బహిరంగంగా విమర్శలు చేసుకునే పరిస్తితి..దీని వల్ల టీడీపీకి ఇంకా డ్యామేజ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మొదట నుంచి టీడీపీలో విభేదాలు ఉన్నాయి. ఎంపీ కేశినేని నానితో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరా, దేవినేని ఉమాలకు పడని పరిస్తితి. అయితే ఈ నలుగురు నేతలు పరోక్షంగా నానికి చెక్ పెట్టాలని చెప్పి రాజకీయం నడిపిస్తున్నారు. ఎలాగైనా విజయవాడ ఎంపీ సీటుని మళ్ళీ నానికి దక్కకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి ఆ నలుగురు సపోర్ట్ చేస్తున్నారు.  చిన్ని సైతం విజయవాడ  రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు..తన అన్నకు చెక్ పెట్టేలా చిన్ని ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ సీటు నానికి కాకుండా చిన్నికి ఇస్తారనే ప్రచారం వస్తుంది. దీంతో కేశినేని ఇటీవల వరుసపెట్టి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మధ్య మైలవరం వెళ్ళి తనతో సహ సీనియర్ నేతలు సీట్లు త్యాగం చేయాలని పరోక్షంగా దేవినేనికి చురకలు అంటించారు. అలాగే నందిగామలో పర్యటిస్తూ..కాల్ మనీ నేరగాళ్లకు, సెక్స్ రాకెట్‌లో ఉన్నవారికి సీట్లు ఇస్తే తాను సహకరించనని బాంబు పేల్చారు. తన తమ్ముడుకు సీటు ఇస్తే సపోర్ట్ చేయనని చెప్పేశారు.

తాజాగా మరోసారి సీట్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీటు ఇస్తే ఓకే అని, లేదంటే తనని ప్రజలు ఇండిపెడెంట్‌గా అయినా గెలిపించుకుంటారని వ్యాఖ్యానించారు. సీటు వద్దని  తాను చెప్పలేదని అన్నారు. ఇలా బెజవాడ రాజకీయాల్లో కేశినేని సంచలనంగా మారారు. మరి చంద్రబాబు బెజవాడ రాజకీయాలపై ఫోకస్ పెట్టి ఈ రచ్చకు బ్రేకులు వేస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news