హాట్ వేసవిలో కూల్ కాశ్మీర్ టూర్.. ఈ ప్రదేశాలన్నీ చుట్టేసి వచ్చేయచ్చు..!

-

ప్రయాణికులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు సమ్మర్ లో చక్కగా ఈ కూల్ టూర్ వేసి వచ్చేయచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇంకో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ రానుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని వరంగల్ మీదుగా వెళ్లనుంది. ప్రైవేట్ సెక్టార్ సర్వీస్ ప్రొవైడర్ అయిన సౌత్ స్టార్ రైల్ ఆపరేట్ చేస్తోంది ఈ టూర్ ప్యాకేజీని. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు చక్కగా చల్లగా కాశ్మీర్ అందాలు చూడొచ్చు. కాశ్మీర్ వ్యాలీ స్పెషల్ పేరు తో ఈ టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. సౌత్ స్టార్ రైల్ దీన్ని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం 12 రోజుల టూర్ ప్యాకేజీ. గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మే 11న కొయంబత్తూర్‌లో స్టార్ట్ అవ్వాల్సి వుంది.

మొదటి రోజు పర్యాటకులు ఈరోడ్, సేలం, ధర్మపురి, హోసుర్, యెలహంక, పెరంబూర్ స్టేషన్లలో ట్రైన్ ఎక్కచ్చు. మే 12 తెల్లవారుజామున 3.45 గంటలకు విజయవాడ, ఉదయం 8 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. హైదరాబాద్ పర్యాటకులు ఎవరైనా ఉంటే వరంగల్‌లో ట్రైన్ ఎక్కాలి. అలానే నాలుగో రోజు ఉదంపూర్ రీచ్ అవుతారు. అక్కడ నుండి శ్రీనగర్ వెళ్ళాలి. దారిలో కాశ్మీర్ లోయ అందాలు చూడొచ్చు. శ్రీనగర్ టూర్ ఐదవ రోజు. మొఘల్ గార్డెన్స్, నిషత్ భాగ్, షాలిమార్ భాగ్ ని చూసేయచ్చు. దాల్ సరస్సు చుట్టూ ఉన్న గార్డెన్స్, షికారా బోట్ రైడ్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చెయ్యచ్చు.

ఆరో రోజు సోన్‌మార్క్ ఫుల్ డే టూర్. ఏడో రోజు గుల్మార్గ్ ఫుల్ డే టూర్. శ్రీనగర్ చేరుకున్న తర్వాత గుల్మార్గ్ గోండోలా కేబుల్ కార్ ని బుక్ చెయ్యచ్చు. ఎనిమిదో రోజు ఉదంపూర్ అలానే తొమ్మిదో రోజు అమృత్‌సర్. ఇండో-పాక్ బార్డర్, గోల్డెన్ టెంపుల్ చూడొచ్చు. పదో రోజు ఆగ్రాకు రీచ్ అవుతారు. తాజ్‌మహల్ చూడొచ్చు. మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ప్యాకేజీ ప్రారంభ ధర ఒకరికి రూ.41,950. https://www.railtourism.com/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news