IPL 2023 : SRH తో మ్యాచ్.. స్టేడియంలో ఘోరంగా కొట్టుకున్న ఫ్యాన్స్..వీడియో వైరల్

-

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో SRH 9 రన్స్ తేడాతో విజయం సాధించింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ… ఆరంభంలోనే వార్నర్ డకౌట్ అయినా సాల్ట్(59), మార్ష్(63) రాణించారు. వీరు కీలక సమయంలో అవుట్ అవ్వడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ ఒత్తిడికి లోనై వెంట వెంటనే అవుట్ అయ్యారు. చివర్లో అక్షర్(29) పోరాడిన DC 188/6 కే పరిమితమైంది.

SRH బౌలర్లలో మార్కండే 2, అభిషేక్, భువీ, హోస్సేన్, నటరాజన్ తలో వికెట్ తీశారు. ఇక నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఢిల్లీలో మ్యాచ్ జరగ్గా, కొందరు అభిమానులు గొడవపడ్డ వీడియో వైరల్ అవుతుంది. ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలపై నెట్టేసుకున్నారు. దీంతో కాసేపు గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ గొడవకు కారణం ఏంటో ఇంకా తెలియ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news