స్టేట్ బ్యాంక్ నుండి సూపర్ స్కీమ్.. రూ.21 లక్షలు ఇలా పొందండి..!

-

ఎస్బీఐ డిపాజిట్ స్కీమ్: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న బెనిఫిట్స్ లో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ కూడా వున్నాయి. ఇందులో చేరడం వలన రకరకాల లాభాలని పొందవచ్చు. డిపాజిట్ స్కీమ్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఇస్తోంది. ఇందులో చేరితే ఒకేసారి చేతికి భారీ మొత్తం పొందొచ్చు. అయితే దీర్ఘకాలం వరకు ఎదురు చూడాల్సి వుంది. అప్పుడే రాబడి బాగా వస్తుంది.

సీనియర్ సిటిజన్స్ 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో వారి డబ్బులని ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యచ్చు. రెగ్యులర్ కస్టమర్ల కన్నా 0.5 శాతం మేర అధిక వడ్డీ వీరికి వస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై 1 శాతం ఎక్కువ వడ్డీ ని పొందొచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై 6.5 శాతం వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఉయ్ కేర్ డిపాజిట్ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం అధిక వడ్డీ వస్తుంది.

ఒకేసారి రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసారంటే మెచ్యూరిటీ సమయంలో రూ. 21 లక్షలకు పైగా లభిస్తాయి. కస్టమర్స్ పదేళ్ల టెన్యూర్ ఎంచుకోవాలి. వడ్డీ రేటు 7.5 ఉంటే వడ్డీ రూపంలో ఏకంగా రూ. 11 లక్షలకు పైగా వస్తాయి. ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఎక్కువ రాబడి రిస్క్ లేకుండా పొందాలంటే ఇందులో ఇన్వెస్ట్ చెయ్యడం మంచిది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. టీడీఎస్ మాత్రం కట్ అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news